మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ దంపతులపై దొంగల దాడి!
- న్యూఢిల్లీలో ఘటన
- మాల్ ను సందర్శించి వస్తున్న ప్రభాకర్ జంట
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాగ్వాదం, దాడి
ఆమె డ్రైవింగ్ బాగా చేయడం లేదంటూ వాదనకు దిగారు. అడ్డుకోబోయిన ప్రభాకర్ పై దాడి చేశారు. ఆస్థమాతో బాధపడుతున్న ప్రభాకర్ రోడ్డుపై పడిపోగా, ఫర్హీన్ పర్స్ ను, స్మార్ట్ ఫోన్ ను లాక్కెళ్లారు. ఓ ఆర్మీ అధికారి సాయంతో కోలుకున్న మనోజ్ ప్రభాకర్, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్స్ లో రూ. 16 వేల రూపాయలు, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.