నచ్చనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకయ్యా.. బయటకు పోవచ్చుగా!: శత్రుఘ్న సిన్హాపై సుశీల్ మోదీ మండిపాటు
- గత కొంతకాలంగా బీజేపీపై సిన్హా విమర్శలు
- ప్రతిపక్ష నేతలపై ప్రశంసలు
- దమ్ముంటే పార్టీని వీడి పోటీ చేయాలని సవాలు
గత కొంతకాలంగా పార్టీపై సిన్హా విషం కక్కుతున్నారని పేర్కొన్న సుశీల్ మోదీ.. ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి ప్రశంసిస్తున్నారన్నారు. ఇటీవల బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్‌ను కలిసి ఆయన కుమారుడే బీహార్ కాబోయే సీఎం అని ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. సిన్హాకు ప్రజల్లో అంతా పాప్యులారిటీనే ఉంటే వెంటనే పార్టీకి రాజీనామా చేసి పాట్నా సాహిబ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని సవాలు చేశారు. తాను బీజేపీలోనే పుట్టానని, బీజేపీలోనే మరణిస్తానని ఈ సందర్భంగా సుశీల్ మోదీ పేర్కొన్నారు.