2019-20లోనూ ముందుండేది ఇండియానే: ప్రపంచ బ్యాంక్
- 2019-20 ఆర్థిక వృద్ధి రేటు 7.5 శాతం
- మరికొన్ని సంవత్సరాలు ఇదే వృద్ధి రేటు
- రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశాలు
- హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
ఇదే సమయంలో దక్షిణాసియాలో పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేసిన వరల్డ్ బ్యాంక్, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని తెలిపింది. ఈ కారణంతో వృద్ధి రేటు మందగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ప్రపంచ సగటు వృద్ధి 2.9 శాతానికి తగ్గనుందని, వచ్చే రెండేళ్లూ 2.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఉత్పత్తి రంగం నెమ్మదించడమే ఇందుకు కారణమని అభిప్రాయపడింది.