కొరటాలపై వస్తోన్న వార్తల్లో నిజం లేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరటాలపై వస్తోన్న వార్తల్లో నిజం లేదట!

  • అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల 
  • తదుపరి సినిమా చిరంజీవితో 
  • మిత్రుడి సినిమాల స్క్రిప్ట్ పై పర్యవేక్షణ  
దర్శకుడిగా కొరటాల శివ అపజయమనేది ఎరుగకుండా ముందుకు దూసుకుపోతున్నారు. తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొరటాల తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నిర్మాతగా మారుతున్నారనీ, ఈ ఇద్దరూ కలిసి చిన్న సినిమాలను నిర్మిస్తారనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

అయితే కొరటాల నిర్మాతగా మారుతున్నారనే వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం. తన మిత్రుడు సుధాకర్ నిర్మించే సినిమాలకి సమర్పకుడిగా వ్యవహరిస్తారట. అంతేకాదు తన మిత్రుడు నిర్మించే సినిమాలకి సంబంధించిన కథలను విని, మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. అంటే ఈ బ్యానర్లో నిర్మితం కానున్న సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ పై కొరటాల పర్యవేక్షణ ఉంటుందన్న మాట. ప్రస్తుతం కొరటాల .. యువ దర్శకులు చెప్పే కథలను వినడంలో బిజీగా వున్నారని అంటున్నారు. 
Koratala Siva

More Telugu News