ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు: శ్రీదేవి కూతురు జాన్వీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు: శ్రీదేవి కూతురు జాన్వీ

  • అమ్మలేదంటే నమ్మబుద్ధి కావడం లేదు 
  • అర్జున్ భయ్యా వాళ్లు అండగా నిలిచారు 
  • ఖుషీ కపూర్ కూడా నటన వైపుకే
తొలి సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి నటన పరంగా మంచి మార్కులు దక్కాయి. ప్రస్తుతం ఆమె 'తక్త్' .. 'రణ్ భూమి' సినిమాలతో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ .."అమ్మలేదు అనే మాట ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆమె చనిపోయిందనే షాక్ నుంచి నేను ఇప్పటికీ బయటికి రాలేదు. అమ్మ చనిపోయిన తరువాత రోజులు ఎలాగడిచిపోయాయనేది కూడా గుర్తుకు లేదు.

అమ్మ చనిపోయినప్పుడు నేను .. హర్ష (అనిల్ కపూర్ తనయుడు) మాట్లాడుకుంటూ ఉండగా, అర్జున్ భయ్యా .. అన్షులా దీదీ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. కుటుంబంలోని వాళ్లమంతా ఒక్కటి కావడం బలాన్ని ఇచ్చింది. అమ్మ దూరమైన తరువాత అర్జున్ భయ్యా వాళ్లు వచ్చి అండగా నిలబడటమే నాకు బాగా గుర్తుండిపోయింది" అని చెప్పుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా నటన పట్ల ఆసక్తిని చూపుతోంది. కరణ్ జొహార్ ఆమెను బాలీవుడ్ తెరకి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. 
janhvi kapoor

More Telugu News