మదనపల్లి బైపాస్ రోడ్డు వద్ద.. ఏపీ అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా!
- శబరిమలకు వెళ్లి వస్తున్న భక్తులు
- మరికొన్ని గంటల్లో గమ్యం చేరుతామనగా ప్రమాదం
- మదనపల్లి సమీపంలో బస్సు బోల్తా
ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, 10 మందికిపైగా గాయపడ్డారు. బస్సు బోల్తా పడిన విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులోనివారిలో ఎక్కువమంది దిదిరెడ్డి పల్లి వాసులుగా తెలుస్తోంది.