వైఎస్ కు వీరారెడ్డి చుక్కలు చూపించేవారు.. 2019 ఎన్నికల్లో గెలిచి పెద్దాయనకు నివాళి అర్పిస్తాం!: మంత్రి ఆదినారాయణ రెడ్డి
- చంద్రబాబును సీఎం చేయడంలో కీలకంగా ఉన్నారు
- వీరారెడ్డి గొప్ప రాజనీతజ్ఞుడని కితాబు
- వర్ధంతి కార్యక్రమంలో నివాళులు అర్పించిన నేతలు
ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సోమశిల ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే బద్వేలుకు వెటర్నరీ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 2019లో టీడీపీ జెండాను మరోసారి ఎగురవేసి పెద్దాయన వీరారెడ్డికి నిజమైన నివాళి అర్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యేలు విజయమ్మ, లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.