తెలంగాణ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమూద్ అలీ
Add ap7am to your home Screen

తెలంగాణ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమూద్ అలీ

  • తన ఛాంబర్ లో మంత్రిగా బాధ్యతల స్వీకరణ
  • అలీని అభినందించిన మాజీ హోం మంత్రి, డీజీపీ
  • ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ తో పనిచేస్తామన్న హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సచివాలయానికి వెళ్లిన ఆయన, ‘డి’బ్లాక్ లోని తన ఛాంబర్ లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ తో పనిచేస్తామని చెప్పారు. కాగా, సచివాలయానికి రావడానికి ముందు ఆయన నాంపల్లిలోని యూసుపైన్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Telangana
home minister
mahamood ali
naini

More Telugu News