జనసేనలో చేరనున్న గిద్దలూరు పారిశ్రామికవేత్త చంద్రశేఖర్!
- గిద్దలూరు టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్
- త్వరలోనే పవన్ సమక్షంలో చేరిక
- ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న నేత
మరోవైపు ఒంగోలు నగరం త్రోవగుంట ప్రాంతంలో తన ఆఫీసును జనసేన కార్యాలయంగా మార్చాలని చంద్రశేఖర్ యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఏపీకి తిరిగివచ్చిన వెంటనే చంద్రశేఖర్ ఆయన సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీచేసిన చంద్రశేఖర్, ప్రజారాజ్యం అభ్యర్థి అన్నె రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.