పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వివాదం.. ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
- పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ పిటిషన్‌పై సుప్రీం విచారణ
- ఏపీ, కర్ణాటక సహా 13 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ
- 28 రోజుల్లోగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఆదేశం
- గోదావరి జలాల వాటాపై తెలంగాణ ఆందోళన నేపథ్యంలో పిటిషన్
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ 28 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రార్ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో సహా మొత్తం 13 మందిని ప్రతివాదులుగా చేర్చారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా ప్రతిపాదించిన బనకచర్ల (నల్లమలసాగర్) లింక్ ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. కేవలం మిగులు వరద జలాలను మాత్రమే కరవు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాల నీటి వాటాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ స్పష్టం చేస్తోంది.
ఈ పిటిషన్‌లో గతంలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజాగా న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో విచారణ ప్రక్రియ ముందుకు సాగనుంది.