ఫలితాలు వెలువడ్డాక క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాం: కిషన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫలితాలు వెలువడ్డాక క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాం: కిషన్ రెడ్డి

  • పరిస్థితిని బట్టి నిర్ణయం
  • కుటుంబ పార్టీ కాదు
  • డబుల్ డిజిట్ సాధిస్తాం
రేపు ఫలితాలొచ్చాక పరిస్థితిని బట్టి.. అలాగే తమ అధిష్ఠానం ఆదేశాల మేరకు మద్దతివ్వాలా.. వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమది కుటుంబ పార్టీ కాదని.. అధిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుంటామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ తన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదని కిషన్ రెడ్డి అన్నారు.

ఫలితాల తర్వాత తమ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణలో తమ పార్టీ టీఆర్ఎస్, మహాకూటమికి సమాంతరంగా బలపడాలని కోరుకుంటున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. రేపటి ఫలితాల్లో తమ పార్టీ డబుల్ డిజిట్ సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు గట్టి పోటి ఇచ్చిందని  కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Kishan Reddy
Lakshman
BJP
TRS

More Telugu News