టీడీపీ, బీజేపీలకు ఇన్ని స్థానాలు రావడానికి కారణం ఇదే: లగడపాటి
Add ap7am to your home Screen

టీడీపీ, బీజేపీలకు ఇన్ని స్థానాలు రావడానికి కారణం ఇదే: లగడపాటి

  • నేను చెప్పిన ఫలితాలు వంద శాతం నిజమవుతాయి
  • నేను చెప్పిన మార్జిన్లను దాటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు
  • టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లకు ఇన్ని స్థానాలు రావడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణం
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తాను వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ వంద శాతం నిజమవుతాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ కు 10 స్థానాలు అటూఇటుగా 65, టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటూఇటుగా 35 వస్తాయని చెప్పానని... చివరి రెండు రోజుల్లో అన్ని పార్టీలు ఎవరికి వీలైన స్థాయిలో వారు ఖర్చు పెట్టారని తెలిపారు.

ఈ డబ్బు ప్రభావం ఫలితాలపై కచ్చితంగా ఉంటుందని... అందుకే తాను 10 స్థానాలు అటూఇటుగా అని చెప్పానని... ఈ డబ్బు ఎంత ప్రభావం చూపినా, తాను చెప్పిన మార్జిన్లను దాటి ఫలితాలు వచ్చే అవకాశమే లేదని అన్నారు. 10వ తేదీ నాటికి కచ్చితమైన ఫిగర్లను కూడా చెబుతానని తెలిపారు. ఫలితాలు ఎంత మారినా 10 శాతానికి మించవని చెప్పారు. టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లకు ఇన్ని స్థానాలు వస్తున్నాయంటే... రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.
lagadapati
exit polls
telangana

More Telugu News