ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర.. దుమారం రేపుతున్న వీడియో
- సోదరుడే హత్యకు కుట్ర పన్నుతున్నాడంటూ వీడియో
- తన ప్రతిష్ఠను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందన్న సన్యాసి పాత్రుడు
- వీడియో వెనక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి వినతిపత్రం
ఈ ఘటనపై సన్యాసి పాత్రుడు కూడా స్పందించారు. ఆ వీడియోలో చెబుతున్నదంతా అబద్ధమని, తనపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ నెల 21న ఓ వివాహానికి హాజరయ్యానని, అదే కార్యక్రమానికి నాతవరానికి చెందిన ప్రతిపక్ష నేతలు కూడా హాజరైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా వరండాలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నాం తప్ప మరేమీ లేదని స్పష్టం చేశారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజీని సేకరించిన కొందరు దానిని తమకు అనుకూలంగా మార్చుకుని, హత్యకు కుట్ర జరుగుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వీడియో వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విశాఖపట్టణం ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.