అప్పటి నుంచే అన్నయ్యకి అభిమానిగా మారిపోయా: అల్లు శిరీశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పటి నుంచే అన్నయ్యకి అభిమానిగా మారిపోయా: అల్లు శిరీశ్

  • 'ఆర్య'.. 'ఆర్య 2' అంటే ఇష్టం
  • ప్రేమ .. స్నేహం .. త్యాగం గొప్పగా చూపించారు  
  • ఆ సీన్ చూసి ఎమోషనల్ అయ్యాను
అల్లు శిరీశ్ ను తను అభిమానించే హీరో ఎవరని అడిగితే అల్లు అర్జున్ పేరే చెబుతాడు. ఒక తమ్ముడిగా ఆయన అల్లు అర్జున్ ను ఎంతగా ప్రేమిస్తాడో, ఒక అభిమానిగా ఆయన అల్లు అర్జున్ ను అంతగా ఆరాధిస్తాడు. ఇదే విషయాన్ని ఆయన కొన్ని సినిమా వేడుకల్లో స్పష్టం చేశాడు కూడా. అల్లు అర్జున్ ప్రతి సినిమాను ఫాలో అయ్యే అల్లు శిరీశ్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు.

గతంలో అల్లు అర్జున్ చేసిన 'ఆర్య 2' సినిమా 2009లో ఇదే రోజున విడుదలైంది. ఈ సినిమాను గురించే తన ట్విట్టర్ ద్వారా అల్లు శిరీశ్ స్పందించాడు. "నేను సినిమాలు చూస్తూ ఎమోషన్ కి లోనైన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 'ఆర్య 2' సినిమాలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం తన గొంతుపై కత్తి పెట్టుకున్న సీన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సీన్ చూసిన దగ్గర నుంచే అల్లు అర్జున్ కి అభిమానినయ్యాను. 'ఆర్య' .. 'ఆర్య 2' ఈ రెండు సినిమాల్లోను ప్రేమ .. స్నేహం .. త్యాగం గురించి గొప్పగా చెప్పారు. అందువలన ఈ సినిమాలంటే నాకెంతో ఇష్టం" అని చెప్పుకొచ్చాడు.       
allu sirish

More Telugu News