ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా?: జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
- కేసుల మాఫీ కోసం మోదీ, అమిత్ షాలతో కుమ్మక్కయ్యారు
- తిత్లీ తుపాను బాధితులను ఇంత వరకు పరామర్శించలేదు
- రైల్వే జోన్ పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?
తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే... బాధితులను జగన్ ఇంతవరకు పరామర్శించలేదని లేఖలో కళా వెంకట్రావు ఎండగట్టారు. రాఫెల్ కుంభకోణంపై జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్-2కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కొర్రీలపై ఎందుకు మాట్లాడరని అన్నారు. ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విశాఖ రైల్వే జోన్ పై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.