రెడ్లకే అత్యధికం... కాంగ్రెస్ తొలి జాబితాలో కులాలు, వర్గాల వారీ కేటాయింపుల వివరాలు!
- 23 మంది రెడ్డి వర్గం నేతలకు స్థానం
- బీసీలకు 13 స్థానాలే
- 10 మంది మహిళలకు స్థానం
ఈ జాబితాలో ఐదుగురు మున్నూరు కాపులు, నలుగురు గౌడ్ లు, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొత్తం జాబితాలో 10 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా, ఈ జాబితాలో 32 చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మార్పు కనిపించగా, మరో ఇద్దరికి స్థానాలను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి, టీఆర్ఎస్ లోకి వెళ్లిన అన్ని నియోజకవర్గాల్లో ఇతరులకు టికెట్లను కేటాయించారు.