అనంతపురంలో టీడీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన పరిటాల సునీత అనుచరుడు!
- మాజీ ఎమ్మెల్యే వెంకట్రాముడు రాజీనామా
- టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం
- ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్య
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తమ రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై జిల్లా టీడీపీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు.