కర్నూలులో కలకలం రేపిన రేవ్ పార్టీ.. అమ్మాయిల అశ్లీల నృత్యాల హోరు!
- జిల్లాకు విస్తరించిన రేవ్ పార్టీ సంస్కృతి
- ఫర్టిలైజర్స్ కంపెనీ డీలర్ల విందు
- అశ్లీల నృత్యాలతో హోరెత్తిన పార్టీ
ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లు అందరూ కలిసి ఓ ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. అమ్మాయిల అశ్లీల నృత్యాలతో పార్టీ హోరెత్తిపోయింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని డీలర్లు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీకి హాజరైన వారిని కలిసి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.