నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమదే: హాస్యనటి గీతా సింగ్
Add ap7am to your home Screen

నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణమదే: హాస్యనటి గీతా సింగ్

  • మా అన్నయ్య పిల్లల బాధ్యత నాదే 
  • వాళ్లు ఇప్పుడు చదువుకుంటున్నారు 
  • వాళ్లను వదిలేయలేక పెళ్లి చేసుకోలేదు
ఈవీవీ సత్యనారాయణ సినిమాలతో గీతా సింగ్ బాగా పాప్యులర్ అయ్యారు. ఈవీవీ చనిపోయాక ఆమెకి ఆ స్థాయి అవకాశాలు రాలేదనే చెప్పాలి. అప్పటి నుంచి అడపాదడపా మాత్రమే ఆమె తెరపై కనిపిస్తూ వస్తున్నారు. అలాంటి గీతా సింగ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, మనసును కదిలించే ఒక విషయం చెప్పారు.

"మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు .. ఆ తరువాత ఆయన చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి పిల్లల పోషణ భారాన్ని నేనే చూస్తున్నాను. వాళ్ల చదువు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సాయం లభించింది. నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను వదిలేయమంటారు .. వాళ్ల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. నా విషయంలో ఇలా జరిగితే నా పిల్లలను మా అన్నయ్య చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య పిల్లలను వదిలేయలేకనే నేను నా పెళ్లి గురించి ఆలోచించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.   
ali
geeta singh

More Telugu News