హైదరాబాద్ లో బాణసంచా ఎంతసేపు కాల్చాలంటే.. నోటిఫికేషన్ జారీచేసిన పోలీసులు!
- ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు
- అందుకు అనుగుణంగా పోలీసుల ఆదేశాలు
- ఉల్లంఘిస్తే పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ నెల 7న దీపావళి పండుగ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలని స్పష్టం చేశారు. అంతకుమించి టపాసులు కాల్చేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.