సీట్ల సర్దుబాటుపై మేం ఎక్కడా మాట్లాడలేదు: కోదండరామ్
Add ap7am to your home Screen

సీట్ల సర్దుబాటుపై మేం ఎక్కడా మాట్లాడలేదు: కోదండరామ్

  • మేము మహాకూటమిలోనే కొనసాగుతాం
  • కూటమిలో పెద్దన్న కాంగ్రెస్సే
  • కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే కూటమి
సీట్ల సర్దుబాటు అంశంపై టీజేఎస్ అధినేత కోదండరామ్ కోపంగా ఉన్నారని... మహాకూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాము మహాకూటమిలోనే కొనసాగుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు అంశంపై తాము ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. మహాకూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ దే అని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే కూటమిని ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాదులో మహాకూటమి నేతల సమావేశం ఈరోజు జరిగింది. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 
kodandaram
mahakutami
tjs
congress
seats

More Telugu News