అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది: త్రివిక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది: త్రివిక్రమ్

  • నేను పంచ్ లు రాయడం మానేశాను 
  • కొత్త పద్ధతిలో నా డైలాగ్స్ ఉంటాయి 
  • 'మాటల మాంత్రికుడు' అనొద్దు    
రచయితగా .. దర్శకుడిగా త్రివిక్రమ్ తన సత్తాను చాటుకున్నారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరవింద' ఘన విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ కి ఈ స్థాయి హిట్ పడినందుకు ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

"నేను పంచ్ లు బాగా రాస్తానని కొంతమంది అంటారు. మరి కొంతమంది 'మాటల మాంత్రికుడు' అంటారు. ఇలా అనిపించుకోవడం .. పిలిపించుకోవడం నాకు ఎంతమాత్రం నచ్చని పని. అలా నన్ను పిలిచేవాళ్లపై నాకు కోపం వస్తుంది .. అలాంటి వాళ్లను నా శత్రువులుగా భావిస్తూ వుంటాను. ఎందుకంటే అందరూ పంచ్ డైలాగ్స్ రాస్తుండటంతో నేను మానేశాను .. అలా పంచ్ లు రాయడం మానేసి చాలా కాలమే అయింది. నా ఆలోచనా విధానంలో నుంచి పుట్టిన స్టేట్ మెంట్స్ ను డైలాగ్స్ గా రాస్తున్నాను. అందువలన ఇక ఎవరూ నా స్టైల్ ని కాపీ కొట్టలేరు" అని చెప్పుకొచ్చారు.    
trivikram

More Telugu News