వీళ్ల వల్ల కాదని తేలిపోయి, వారిని తెచ్చారు... ఇదే తమ విజయమంటున్న వెస్టిండీస్!
- తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను డ్రా చేసుకున్న వెస్టిండీస్
- చివరి మూడు వన్డేలకూ బుమ్రా, భువీలకు పిలుపు
- స్పందించిన స్టువర్ట్ లా
ఇక వీరిని తీసుకోవడంతో భారత బౌలింగ్ లైనప్ మరింత బలోపేతం కాగా, వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్, తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందని ఆయన అన్నాడు. తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు.