అలా చేస్తే చంద్రబాబు విజయాన్ని అడ్డుకోవడం దేవుడికి కూడా సాధ్యం కాదు: జేసీ
- 40 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత
- వారిని మార్చగలితే చంద్రబాబును ఎవరూ ఆపలేరు
- జగన్, పవన్ భిన్న ధ్రువాలు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌పైనా జేసీ మాట్లాడారు. వారిద్దరూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని, అయితే, వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెబితే కనుక, అది అబద్ధం చెప్పడమే అవుతుందని జేసీ వ్యాఖ్యానించారు. జగన్, పవన్ ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటి వారని, వారిద్దరూ కలిసి పనిచేస్తారని తాను అనుకోవడం లేదన్నారు.