తిత్లీ బాధితులను కొందరు రెచ్చగొడుతున్నారు.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం!: సీఎం చంద్రబాబు వార్నింగ్
- సాయం చేయకపోయినా ఫరవాలేదు
- వదంతులు వ్యాప్తిచేసి ప్రజల్ని రెచ్చగొట్టొద్దు
- ట్విట్టర్ లో కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది విద్యుత్, రోడ్లు సహా పలు మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.