మా ఆయన ఇప్పుడు 'మామ డ్యూటీ' చేస్తున్నాడు: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ఆయన ఇప్పుడు 'మామ డ్యూటీ' చేస్తున్నాడు: ఉపాసన

  • మేనకోడలితో దగ్గరుండి కేక్ కట్ చేయిస్తున్న చెర్రీ
  • ట్విట్టర్ లో పోస్టు చేసిన ఉపాసన
  • అందరినీ అలరిస్తున్న అల్లు అయాన్
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లో లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించాడు.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఉపాసన, "మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే" అని వ్యాఖ్యానించింది. రామ్ చరణ్ మేనకోడలితో పాటు అల్లు అర్జున్ కుమారుడు అయాన్, మరికొందరు చిన్నారులు ఈ పిక్ లో ఉన్నారు. చెర్రీ దగ్గరుండి మరీ తన మేనకోడలితో కేక్ కట్ చేయిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ పిక్ లో అయాన్, తదేకంగా కేక్ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుండగా, "అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌ పైనే ఉంది" అంటూ ఫ్యాన్స్ సరదా కామెంట్లు పెడుతున్నారు.
Ramcharan
Upasana
Twitter
Allu Ayaan

More Telugu News