తిత్లీ ఎఫెక్ట్: రైల్వే ట్రాకులపై చెట్లు.. కుప్పకూలిన సిగ్నలింగ్ వ్యవస్థ.. పలు రైళ్ల రద్దు
- రైల్వే ట్రాక్‌లపై కూలిన చెట్లు
- దెబ్బతిన్న సిగ్నల్ వ్యవస్థ
- కొనసాగుతున్న మరమ్మతులు
గురువారం హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సంత్రగచ్చి-చెన్నై స్పెషల్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఖరగ్‌పూర్-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్లాట్‌ఫామ్‌లపై పడిగాపులు కాశారు. గాలుల దెబ్బకు పలాస రైల్వే స్టేషన్ తీవ్రంగా దెబ్బతిందని, పలుచోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ పాడైందని, బరంపురం-కోటబొమ్మాళి మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.