‘పెళ్లి చూపులు’ గురించి ఫన్నీగా స్పందించిన రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పెళ్లి చూపులు’ గురించి ఫన్నీగా స్పందించిన రానా

  • రానా హోస్ట్‌గా నెం 1 యారి సీజన్ 2
  • నా పెళ్లికి మీ అందరినీ పిలుస్తా
  • పెళ్లిని ప్రసారం చేద్దాం
దగ్గుబాటి రానా హోస్ట్‌గా నెం 1 యారి సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు రానా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్నంతా ఫేస్‌బుక్‌లో లైవ్‌‌ ద్వారా ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు రానా సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ఓ విలేఖరి రానాను పెళ్లి విషయమై ప్రస్తావిస్తూ... ‘ప్రస్తుతం ప్రదీప్ పెళ్లి చూపులు అనే షో చేస్తున్నారు. మీకింకా పెళ్లి కాలేదు కాబట్టి మీరు కూడా అలాంటి షో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి రానా... ‘నేను పెళ్లి చేసుకుంటే మీ అందరినీ పిలుస్తా. దాన్ని వీడియో తీసి ఒక షో చేసి ప్రసారం చేద్దాం’ అని ఫన్నీగా స్పందించారు రానా. నెం 1 యారీ షో ప్రసారానికి ఆదివారాన్నే ఎంచుకోవడానికి కారణమేంటని ప్రశ్నించగా.. ‘ఆదివారం అంతా ఇంటి దగ్గరే ఉంటారు. ఆ సమయంలో వచ్చి ప్రేక్షకులను నవ్విద్దామనే కోరికతోనే వస్తున్నా’ అని రానా తెలిపారు.

Rana Daggubati
No.1 Yari
Marriage
Pradeep
Facebook Live

More Telugu News