ఎటెళ్లాలో తెలియక ఇంట్లోకి వచ్చేసిన ఆరడుగుల నాగుపాము... కొట్టి చంపిన ప్రజలు!
- గండికోట జలాశయంలో 12 టీఎంసీలకు నీటినిల్వ
- బయటకు వస్తున్న విషసర్పాలు
- ఆందోళన చెందుతున్న ప్రజలు
జలాశయంలో నీరు లేనప్పుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండే సర్పాలు, నీరు పెరగడంతో ఎటెళ్లాలో తెలియక జనావాసాల్లోకి వస్తున్నాయి. తన ఇంట్లో పామును చూసి భయపడిన బెనర్జీ, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పడంతో వారు వచ్చి పామును కర్రలతో కొట్టి చంపారు. విషసర్పాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడుతున్నట్టు నిర్వాసితులు వ్యాఖ్యానించారు.