మన ఉద్యోగాలను వారు లాగేసుకుంటున్నారు.. అక్రమ వలసదారులపై అమిత్ షా
- అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు వత్తాసు పలుకుతున్నాయి
- రాహుల్ బాబా పగటి కలలు మానుకోవాలి
- మళ్లీ అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారులను బయటకు పంపేస్తాం
దేశ భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని, నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ)ని ప్రస్తావిస్తూ ఇందులో గుర్తించిన 40 లక్షలమంది అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించివేస్తామన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలపై రాహుల్ బాబా, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని దుయ్యబట్టారు. అక్రమ వలసదారుల వల్ల స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని అమిత్ షా పేర్కొన్నారు.
‘‘వీరు మన యువత ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇది కనిపించడం లేదు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం’’ అని అమిత్ షా హెచ్చరించారు.