అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం!: టీఆర్ఎస్ కు డీకే అరుణ వార్నింగ్
- రాజకీయాల ముసుగులో రౌడీల్లా ప్రవర్తిస్తే ఖబడ్దార్
- కేసీఆర్-మోదీ ఒప్పందంలో భాగమే ముందస్తు ఎన్నికలు
- పాలించడం చేతకాక మధ్యలోనే కాడిపడేసిన కేసీఆర్
ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే పాలించడం చేతకాక మధ్యలోనే కాడిపడేసిన కేసీఆర్, ఇప్పుడు మరోమారు ప్రజలను మోసగించాలని చూస్తున్నారన్నారు. మోదీ-కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ముందస్తు ఎన్నికలు వచ్చాయని అరుణ ఆరోపించారు.