కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన సొంత నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు
- కాంగ్రెస్ లో చేరిన గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ నేతలు
- కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్నది ఇక్కడే
- కేసీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న ఉత్తమ్
రేణుకతో పాటు ఎంపీటీసీలు మమతాభాను, కవిత యాదగిరి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్ లు పార్టీ మారారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ జగదేవ్ పూర్ పరిధిలోనే ఉండటం గమనార్హం. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన ఈ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.