మిస్టర్‌ సి, మై లవ్‌.. ఈ జర్నీ ఇంకా ఆనందంగా కొనసాగనీ!: రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్టర్‌ సి, మై లవ్‌.. ఈ జర్నీ ఇంకా ఆనందంగా కొనసాగనీ!: రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన

  • నీ వృత్తిలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్నావు
  • ఫేమ్‌ని, సక్సెస్‌ని, ఫెయిల్యూర్ ని పద్ధతిగా హ్యాండిల్‌ చేస్తున్నావు
  • తదుపరి పదకొండేళ్లు షేర్‌ చేసుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది
మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలిసినిమా ‘చిరుత’ విడుదలై పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సతీమణి ఉపాసన ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘మిస్టర్‌ సి, మై లవ్‌, నీ జర్నీలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్నావు. ఫేమ్‌ని, సక్సెస్‌ని, ఫెయిల్యూర్ ని ఓ పద్ధతిగా హ్యాండిల్‌ చేస్తున్న నీ తీరును నేను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ, బలంలో ఆశ్రయం తీసుకోవడం నేర్చుకున్నాను. తదుపరి పదకొండేళ్లు కూడా నీతో షేర్‌ చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 చిరుతతో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్‌ మగధీర సినిమాతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంగస్థలం సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడమేకాదు నటుడిగా ఓ స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం చెర్రీ బోయపాటితో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ చిత్రంలో నటిస్తున్నాడు. అక్టోబర్‌ 19న దీని ఫస్ట్‌కాఫీ విడుదల కానుందని సమాచారం.
Ramcharan
Upasana
Chirutha

More Telugu News