పెద్ద పొరపాటు చేశాను .. ఇప్పటికీ బాధపడుతుంటాను: సీనియర్ హీరో ఆనంద్
Add ap7am to your home Screen

పెద్ద పొరపాటు చేశాను .. ఇప్పటికీ బాధపడుతుంటాను: సీనియర్ హీరో ఆనంద్

  • బాలచందర్ గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది 
  • 8 నెలలు మరో మూవీ చేయవద్దని అన్నారు 
  • అందుకే ఆ సినిమాలో ఛాన్స్ వదులుకున్నాను
హీరోగానూ .. కేరక్టర్ ఆర్టిస్ట్ గాను మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. "మణిరత్నం గారి మూవీ 'దొంగ దొంగ' హిట్ కావడంతో వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కొన్ని ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో బాలచందర్ గారి 'డ్యూయెట్' సినిమాలో ఛాన్స్ వచ్చింది.

8 నెలల పాటు ఆ సినిమా తప్ప మరో సినిమా చేయకూడదని అన్నారు. అడ్వాన్సులు ఇచ్చినవాళ్లు అంతకాలం ఆగరు. ఆ సమయంలో అల్లు అరవింద్ గారు కూడా 'డ్యూయెట్' సినిమా వదులుకోవద్దని చెప్పారు. కానీ నేను ఆ మాట వినకుండా వదులుకుని పొరపాటు చేశాను. నేను వదులుకోవడంతో ఆ పాత్రను రమేశ్ అరవింద్ చేశాడు. 'అంజలి .. అంజలి' అంటూ ఆ పాత్రపైనే ఒక సూపర్ హిట్ సాంగ్ వుంది. ఆ పాట వినిపించినప్పుడల్లా బాధపడుతూనే వుంటాను" అని చెప్పుకొచ్చారు.   
aanand
ali

More Telugu News