ఆత్మహత్యా యత్నం.. ఆపై హల్చల్!: సిబ్బందిని హడలెత్తించిన హెడ్‌కానిస్టేబుల్
- రోల్‌కాల్ సమయంలో ఛాతిపై రెండు రౌండ్ల కాల్పులు
- ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా వాహనం దూకి పరుగులు
- తూర్పుగోదావరి జిల్లా కూనవరం పోలీస్‌స్టేషన్‌లో ఘటన
కాకినాడకు చెందిన కె.శ్రీనివాస్ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రోల్‌కాల్ సమయంలో ఛాతిపై రెండు రౌండ్లు కాల్పులు జరుపుకొన్నాడు. ఈ హఠాత్పరిణామంతో దిగ్భ్రమకు గురైన సిబ్బంది తక్షణం అతన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా పాల్వంచ వద్ద వాహనం నుంచి దూకి పరుగందుకున్నాడు. తనను బతికించే ప్రయత్నం చేయొద్దంటూ అటూ ఇటూ తిరుగుతూ పది నిమిషాల పాటు సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు సిబ్బంది అతన్ని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.