ఆంధ్ర కాంట్రాక్టర్ల బూట్లు నాకుతున్నారు: టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత శ్రావణ్ ఫైర్
- ఆంధ్ర కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి కావాలి కానీ.. చంద్రబాబు వద్దా?
- హెలికాప్టర్ లో అమరావతికి వెళ్లినప్పుడు తెలంగాణ తాకట్టు గుర్తుకు రాలేదా?
- కోర్టు కేసులపై చర్చకు కేటీఆర్ సిద్ధమా?
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలన్న ప్రశ్నకు ప్రతి పక్షాల వద్ద సమాధానమే లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా.... ఇదే ప్రశ్నను రాష్ట్రంలోని మేధావులు, జర్నలిస్టులు, రైతులు, నిరుద్యోగులు, ముస్లింలను అడిగితే ఎందుకు గద్దె దింపాలో చెబుతారని అన్నారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న భారీ అవినీతిపై కోర్టుకు వెళ్లడం కూడా నేరమేనా? అని మండిపడ్డారు. కేసులపై చర్చకు కేటీఆర్ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.