కడప జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత!
- జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిన ఆప్కో చైర్మన్
- ఆయనెందుకు వచ్చారంటూ నిలదీసిన వైకాపా ఎమ్మెల్యేలు
- మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి లతో వాగ్వాదం
కరవుపై సమాధానం చెప్పాలని సోమిరెడ్డిని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిలదీయగా, సోమిరెడ్డి సైతం ఘాటుగా స్పందించారు. సాఫీగా సాగుతున్న చర్చను వైకాపా నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని సోమిరెడ్డి అనడంతో, నేతల మధ్య వాగ్వాదం మరింతగా పెరిగింది. నెల రోజుల క్రితం పంటలను సోమిరెడ్డి స్వయంగా పరిశీలించిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీకాంత్ రెడ్డి, ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ సమయంలో కల్పించుకున్న పోలీసులు, ఇరు వర్గాల వారికీ నచ్చజెప్పి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు.