ఐఫోన్ ఆర్డర్ చేస్తే చైనా ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌కు భారీ జరిమానా విధించిన కమిషన్
- ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1.43 లక్షలతో ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి
- డెలివరీలో నకిలీ చైనా ఫోన్ రావడంతో షాక్
- ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్‌కు ఆశ్రయం
- ఫ్లిప్‌కార్ట్‌ది అనుచిత వ్యాపార పద్ధతి అని తేల్చిన కమిషన్
- వడ్డీ, పరిహారంతో పూర్తి డబ్బు వాపస్ ఇవ్వాలని ఆదేశం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల కమిషన్ గట్టి షాకిచ్చింది. ఐఫోన్ 14 ప్రో ఆర్డర్ చేసిన వినియోగదారుడికి నకిలీ చైనా ఫోన్ పంపిన ఘటనలో, సదరు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్ అనుచిత వ్యాపార ధోరణులను అవలంబిస్తోందని, సేవల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని కమిషన్ తన తీర్పులో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే, అనూప్‌షహర్‌కు చెందిన ఓం ప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి 2023 మే 29న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,43,335 క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించి ఐఫోన్ 14 ప్రోను ఆర్డర్ చేశారు. న్యూఢిల్లీలోని ఆర్.కె.పురం చిరునామాకు ఆ పార్శిల్ డెలివరీ అయింది. అయితే, డెలివరీ ఏజెంట్ సమక్షంలోనే ప్యాకేజీని తెరిచి వీడియో తీయగా, లోపల నకిలీ ఆపిల్ లోగోతో ఉన్న ఆకుపచ్చ రంగు చైనా స్మార్ట్‌ఫోన్ చూసి ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఐఫోన్‌లో మూడు కెమెరాలు ఉండగా, సదరు నకిలీ ఫోన్‌లో కేవలం రెండే కెమెరాలు ఉన్నాయి.
ఈ ఘటనపై వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేదు. వినియోగదారుడు సమర్పించిన 'రిటర్న్ రిక్వెస్ట్'ను విక్రేత తిరస్కరించారు. తగిన విచారణ జరపకుండానే ఉత్పత్తి పాడైపోయిందని కంపెనీ ప్రతినిధి తేల్చి చెప్పడంతో, బాధితుడికి రిఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ అందలేదు. దీంతో నిరాశకు గురైన బాధితుడు 2023 ఆగస్టు 3న బులంద్‌షహర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కమిషన్, తాము కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తామన్న ఫ్లిప్‌కార్ట్ వాదనను తోసిపుచ్చింది. వినియోగదారుడి నుంచి ఫోన్‌ను వెనక్కి తీసుకుని, రూ.1,43,335 పూర్తి మొత్తాన్ని 7 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు రూ.20,000, న్యాయపోరాట ఖర్చుల కింద మరో రూ.10,000 కలిపి మొత్తం రూ.30,000 అదనపు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను 45 రోజుల్లోగా అమలు చేయాలని, ఒకవేళ విఫలమైతే బకాయి మొత్తంపై 8 శాతం వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.