ఆఖరి టెస్ట్‌లో తొలిరోజు భారత్ బౌలర్ల హవా
- చెలరేగిపోయిన ఇషాంత్, బుమ్రా, జడేజా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- ఓపెనర్లు శుభారంభాన్నిచ్చినా ఆఖరిలో తడబాటు
- 198 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు
భారత్ బౌలర్ల జోరు చూస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తొలిరోజే ముగింపు పలుకుతారనిపించింది. చివర్లో బట్లర్ (11 నాటౌట్), ఆదిల్ రషీద్ (4 నాటౌట్)లు అడ్డుగోడగా నిలవడంతో సాధ్యం కాలేదు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
