కాంగ్రెస్ పార్టీ నా రక్తం తాగాలన్న దాహంతో ఉంది!: మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
- రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు
- అజయ్ సింగ్ ప్రత్యక్షపోరుకు రావాలి
- ఇలాంటి చర్యలకు నేను తలొగ్గను
కాగా, సిధి జిల్లాలోని చుర్హాత్ లో జన్ ఆశీర్వాద్ యాత్ర జరుగుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఈ రాళ్ల దాడి జరిగింది. దాని అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షనేత అజయ్ సింగ్ నిజంగా బలమైన నేత అయితే ప్రత్యక్షపోరుకు రావాలని సవాల్ విసిరారు. తాను శారీరకంగా బలంగా లేను కానీ, ఇలాంటి చర్యలకు మాత్రం తలొగ్గనని, రాష్ట్ర ప్రజలంతా తనతో ఉన్నారని వ్యాఖ్యానించారు.