తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘చంటిగాడు’ దర్శకురాలు జయ కన్నుమూత
- సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన జయ
- దర్శకత్వంపై మక్కువతో మెగాఫోన్ చేతపట్టిన వైనం
- తొలి సినిమాతోనే ప్రతిభ చాటుకున్న జయ
ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజు ఆమె భర్త. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ తొలుత సినీ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మెగాఫోన్ చేపట్టి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె తీసిన ఆఖరు చిత్రం ‘వైశాఖం’. శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.