20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున... హరికృష్ణ జీవితంలో ఓ పేజీ!
- 1999, ఆగస్టు 30న రాయచోటిలో హరికృష్ణ
- ఆపై పీలేరులో ఎన్నికల ప్రచారం
- చైతన్య రథంపైనే ప్రజల్లో తిరిగిన హరికృష్ణ
పీలేరు నుంచి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లెపు చిన్న రెడ్డప్పను గెలిపించాలని ఓటర్లను కోరారు హరికృష్ణ. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చాలంటే అన్న తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. నాడు ఆయన చిత్తూరు బాబు ఇంట్లో విందు కూడా చేశారు. 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున తమ ప్రాంతంలో హరికృష్ణ పర్యటించారని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడి ప్రజలు.