అనంతపురంలో నిత్య పెళ్లి కూతురు.. ఏడడుగులు.. ఏడు పెళ్లిళ్లు!
- పెళ్లి పేరుతో యువకులను బురిడీ కొట్టించిన యువతి
- ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడిన వైనం
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు?
జిల్లాలోని గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన ఓ యువకుడిని 8 నెలల క్రితం పెళ్లాడిన సదరు యువతి కలహాల కారణంగా అతడి నుంచి విడిపోయింది. అయితే, విడాకులు తీసుకోకుండానే వజ్రకరూరు మండలానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. అంతకంటే ముందు గోరంట్లకు చెందిన ఓ యువకుడిని, గుంటూరులో మరో యువకుడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా పెళ్లి పేరుతో మరో ముగ్గురిని మోసం చేసింది. ఆమె మోసం వెలుగుచూడడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.