ఎన్టీఆర్ అంటే గౌరవం వుండేది .. భయం ఉండేది కాదు: జయసుధ
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ అంటే గౌరవం వుండేది .. భయం ఉండేది కాదు: జయసుధ

  • చిన్నప్పటి నుంచి నాకు ధైర్యం ఎక్కువే
  • 'ఎదురీత'లో రెండవ హీరోయిన్ గా చేశాను 
  • 'అడవిరాముడు' నుంచి వరుసగా చేశాను     
చెన్నైలో పుట్టిపెరిగిన జయసుధ 'లక్ష్మణ రేఖ' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'జ్యోతి' సినిమాతో కెరియర్ పరంగా ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. అలాంటి జయసుధ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో  పాల్గొన్నారు. "ఎన్టీ రామారావుగారితో కలిసి నటించారు కదా .. ఆయన కాంబినేషన్లో చేస్తుంటే ఎలా ఉండేది?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

అందుకు జయసుధ స్పందిస్తూ .. "ఎన్టీ రామారావుగారితో కలిసి 'ఎదురీత' సినిమాలో చేశాను .. ఆ సినిమాలో ఫస్టు హీరోయిన్ వాణిశ్రీ గారు .. నేను రెండవ హీరోయిన్. 'అడవిరాముడు' నుంచి ఇక వరుస సినిమాలు చేస్తూ వెళ్లాను. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం ఎక్కువే. అందువలన రామారావుగారితో కలిసి నటిస్తున్నప్పుడు ఆయన అంటే గౌరవం ఉండేది గానీ .. భయం ఉండేది కాదు. రామారావుగారు సెట్ కి రాగానే మిగతా వాళ్లు ఎలా ఉండాలి .. ఎలా నడుచుకోవాలి? అనే విషయాన్ని మాకు ముందుగానే సీనియర్స్ చెప్పేవారు .. అలాగే ఉండేవాళ్లం" అని చెప్పుకొచ్చారు.   
jayasudha
ali

More Telugu News