నా అసలుపేరు సుజాత .. సినిమాల్లోకి వచ్చాక మార్చారు: సహజనటి జయసుధ
- నిన్నటితరం స్టార్ హీరోయిన్
- అగ్ర హీరోల జోడీగా అనేక చిత్రాలు
- సహజనటిగా అభిమానుల మనసుల్లో స్థానం
"నా అసలు పేరు సుజాత .. నేను పుట్టినప్పుడు 's' అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలని మా పేరెంట్స్ కి ఎవరో చెప్పారట. దాంతో ముందుగా 'సుభద్ర' అని అనుకున్నారట .. అది ఆ తరువాత 'సుజాత'గా మారింది. నేను సినిమాల్లోకి వచ్చాక .. ఆల్రెడీ ఒక సుజాత ఫీల్డ్ లో ఉండటంతో, ఒక తమిళ నిర్మాత నా పేరును 'జయసుధ' గా మార్చారు. అప్పటి నుంచి జయసుధగానే కొనసాగాను" అంటూ చెప్పుకొచ్చారు.