కుప్పకూలిన కోట పైభాగం.. శిథిలాల్లో చిక్కుకుని డోడియా రాజమాత దుర్మరణం!
- మధ్యప్రదేశ్ రత్లామ్ లో దారుణం
- ఒక్కసారిగా కూలిన కోట పైభాగం
- ప్రాణాలు విడిచిన రాజమాత జ్యోతికుంవర్
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాజమాత ఒక్కరే కోటలో ఉన్నారు. ఆమె కుమారుడు రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి పనివారు విధులు ముగించుకుని వెళ్లిపోయాక కోటలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో రాజమాత సహాయకురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటిన వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రాజమాత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.