2022 కల్లా భారతీయులను సొంతంగా అంతరిక్షంలోకి పంపుతాం!: మోదీ
- అది యువకుడు లేదా యువతి కావొచ్చు
- స్వాగతించిన ఇస్రో చైర్మన్ శివన్
- సమయం తక్కువగా ఉన్నా పూర్తిచేస్తామని హామీ
కాగా, ప్రధాని ప్రకటనను ఇస్రో చైర్మన్ కె.శివన్ స్వాగతించారు. తమకు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ వ్యోమగాములను జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే అవకాశముందని వ్యాఖ్యానించారు. రాబోయే 40 నెలల్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.9,000 కోట్లు వెచ్చించనున్నట్లు శివన్ పేర్కొన్నారు. ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రామ్ లో భాగంగా సోవియట్ యూనియన్(ఇప్పటి రష్యా) 1984, ఏప్రిల్ 2న ప్రయోగించిన సూయజ్-టీ11 నౌక ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు.