భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'శ్రీనివాస కళ్యాణం'
- మొన్ననే థియేటర్లకు వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం'
- బలమైన కథాకథనాలు
- ఆకట్టుకునే సంగీతం
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నైజామ్ ఏరియాలో స్వయంగా రిలీజ్ చేయగా, తొలి రోజునే 1.17 కోట్ల షేర్ ను వసూలు చేసింది. యూఎస్ లో తొలి రోజున ఈ సినిమా 20 లక్షలను రాబట్టింది. పెళ్లి సందడి ప్రధానంగా సాగే కథా కథనాలు .. భారీ తారాగణం .. మనసును తాకే పాటలు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీన 'గీత గోవిందం' విడుదల కానుండటంతో, ఆ లోగా 'శ్రీనివాస కళ్యాణం' మరిన్ని వసూళ్లను సాధించవలసి ఉంటుందని అంటున్నారు.