సౌదీకి భారీ షాక్.. హౌతీలతో అమెరికా రహస్య చర్చలు!

సౌదీకి భారీ షాక్.. హౌతీలతో అమెరికా రహస్య చర్చలు!

Houthi rebels meet US officials in Oman for secret peace negotiations
  • ఒమన్‌లో హౌతీ ప్రతినిధులతో అమెరికా రహస్య భేటీ
  • హౌతీలకు వ్యతిరేకంగా సౌదీకి సైనిక సాయం నిరాకరణ
  • అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై దాడి చేయబోమని హౌతీల హామీ
  • సౌదీ నౌకలకు మాత్రం రక్షణ ఇవ్వలేమన్న హౌతీలు
  • ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో దౌత్య మార్గాలపై సౌదీ దృష్టి
యెమెన్ విషయంలో అమెరికా అనూహ్యమైన అడుగు వేసింది. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌తో ఒమన్‌లో రహస్యంగా సమావేశమైంది. ఈ చర్చల తర్వాత, హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీ అరేబియాకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది.

బయటకు వచ్చిన నివేదికల ప్రకారం, ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో వారాంతంలో ఈ భేటీ జరిగింది. ప్రాంతీయ మధ్యవర్తిగా ఒమన్ ప్రభుత్వం ఈ చర్చలకు సహకరించింది. ఈ సమావేశంలో అమెరికా తరఫున ఎంబసీ అధికారులు పాల్గొనగా, హౌతీల నుంచి మహ్మద్ అబ్దుల్ సలాం (అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తి), అబ్దుల్ మాలిక్ అల్ అజిరి వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమెరికా నౌకలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని, 2025లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హౌతీలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇజ్రాయెల్ లేదా ఇతర వాణిజ్య నౌకలను కూడా లక్ష్యంగా చేసుకోబోమని వారు చెప్పినట్లు తెలిసింది. అయితే, తమ దేశంపై సౌదీ దిగ్బంధనం విధించినందున, సౌదీకి సంబంధించిన నౌకలకు ఈ హామీ వర్తించదని స్పష్టం చేశారు.

ఇటీవల ఎర్ర సముద్ర తీరంలో హౌతీలు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సైనిక సహాయం కోరారు. అయితే, హౌతీలతో తాము నేరుగా సంప్రదింపులు జరుపుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే ధ్రువీకరించారు. తాజా భేటీతో సౌదీ అభ్యర్థనను అమెరికా తిరస్కరించినట్లయింది. ఈ పరిణామంతో, దౌత్య మార్గాలను అన్వేషించాల్సిన ఒత్తిడి సౌదీ అరేబియాపై పెరిగింది.
Advertisement
Houthi Rebels
Donald Trump
Saudi Arabia
US Houthi Secret Talks
Oman Peace Negotiations
Mohammed bin Salman

More Telugu News