కరుణానిధి స్క్రీన్ ప్లే అందించిన తెలుగు సినిమా ఇదే..!
- కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన కరుణ
- తెలుగు సినీ రంగంతో కూడా అనుబంధాన్ని కొనసాగించిన కరుణ
- పలు సినీ వేడుకలకు హాజరు
ఓ తెలుగు సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. తమిళంలో జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన 'వండిక్కారణ్ మగన్' చిత్రానికి తెలుగు రీమేక్ ఈ సినిమా. తమిళ సినిమాకు మాటలు రాసిన కరుణానిధి, తెలుగు చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. కరుణ మేనల్లుడు మురసోలి సెల్వం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.